Saturday, April 11, 2009

2

"రమేషా...చూడా...వాడేదో అడిగినాడు...ఈరాదా?...పెతిదానికీ డబ్బులకాడ చూసుకోకూడదు నాయనా", అని ఆమె వెళ్లిపోయింది.

ఆ మాటను నేను అందుకొని, "ఒరే. మీ అమ్మగూడా చెప్పిందిగదరా. అమ్మ మాట కాదనగూడదురా. అమ్మ మాట వింటే పుణ్యంరా. అదే మా అమ్మగనక నాతో ఇట్టాగే అని ఆఫురేటుకి కాదురా ఊరకనే యిచ్చెయ్ రా అనుంటే నేను ఎవరికైనా సరే టకా మని యిచ్చేస్తానురా", అన్నాను వాడి గెడ్డం పట్టుకుంటా.

(మా అమ్మ ప్రాణంపోయినా అట్టా అనదు. అన్నా నేను ప్రాణం పోయినా యివ్వను)

1 comment: